Today Telugu Gospel readings Video for status November 8 2025
ఈరోజు తెలుగు బైబిల్ వాక్యము/ఈరోజు బైబిల్ పఠనం నవంబర్ 8 2025
లూకా సువార్త 16:9-15
“అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలయన, ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్యనివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను.
స్వల్ప విషయములలో నమ్మదగినవాడు, గొప్ప విషయములలోను నమ్మదగినవాడుగా ఉండును. అల్పవిషయములలో నమ్మదగనివాడు, గొప్ప విషయములలోను నమ్మదగనివాడుగా ఉండును.
కనుక, ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగినవారు కానిచో, పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును?
పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగినవారు కానిచో, మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును?
“ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఏలయన, వాడు ఒకనిని ద్వేషించును, వేరొకనిని ప్రేమించును. లేదా, ఒకనిని అనుసరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవమును, ద్రవ్యమును సేవింపలేరు.”
ధనలోభులగు పరిసయ్యులు ఈ మాటలు అన్నియు విని ఆయనను హేళనచేయుచుండగా,
యేసు వారితో ఇట్లు పలికెను: “మనుష్యుల యెదుట మీకై మీరు నీతిమంతులము అని చెప్పు కొనుచున్నారు. అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుష్యులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును.
Today Telugu Gospel readings November 8 2025, Telugu daily gospel reading, Telugu daily Bible verses video, Telugu devotional Bible reading



