Daily Bible Reading Telugu November 15 2025

రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త 18:1-8  యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది..

 

ఎల్లప్పుడు ప్రార్ధన సలుపుటకు, నిరుత్సాహ పడకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను:

“ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనిన భయపడడు. మానవులను లక్ష్యపెట్టడు.

అచ్చట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి 'నాకు న్యాయము చేకూర్చుము. నా ప్రత్యర్థినుండి కాపాడుము' అని తరచుగా మొరపెట్టుకొనుచుండెడిది.

అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టెను. కాని అతడు 'నేను దేవునికి భయపడను. మానవులను గౌరవింపను.

అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున, ఈమె పదేపదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై, ఈమెకు న్యాయము చేకూర్చెదను' అని తలంచెను.”

అంతట యేసు ఇట్లనెను: “అవినీతి పరుడైన ఈ న్యాయాధిపతి ఏమిపలికెనో వింటిరిగదా!

అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా?

దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్యకుమారుడు వచ్చునపుడు ఈ భూమిమీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా?”

 

#రోజువారీ బైబిల్ పఠనం, #ఈరోజు బైబిల్ వచనం, #పవిత్ర గ్రంథ పఠనం, Bible Verse of the Day Telugu November 15 2025 , Daily Bible Reading Telugu November 15 2025, Today Telugu Bible Readings Video November 15 2025, Daily Bible Reading Telugu, Telugu Daily Bible Verses Video,  Telugu Catholic Bible Readings Today,